: మిత వ్యయానికి గ్రీస్ ప్రజలు ససేమిరా... రెఫరెండంను గౌరవిస్తామంటున్న ఈయూ


ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన గ్రీస్ లో మిత వ్యయానికి కట్టుబడే విషయంపై ప్రజలు ససేమిరా అంటున్నారు. ఈ మేరకు నిన్న ఆ దేశంలో జరిగిన రెఫరెండంలో 61 శాతం మంది ప్రజలు మిత వ్యయానికి వ్యతిరేకంగా ఓటేశారు. దీంతో గ్రీస్ మరింత ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం లేకపోలేదని ఆర్థిక విశ్లేషకులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఇక గ్రీస్ రెఫరెండంను గౌరవించి తీరతామని యూరోపియన్ యూనియన్ ప్రకటించింది. ప్రజాభిప్రాయాన్ని గౌరవించక తప్పదని కూడా ఈయూ వెల్లడించింది. యూరోపియన్ యూనియన్ ప్రకటించిన ఉద్దీపన షరతులకు అంగీకరించని నేపథ్యంలో యూరో జోన్ నుంచి గ్రీస్ బయటకు రానుంది. గ్రీస్ నిష్క్రమణ ప్రభావంపై చర్చించేందుకు యూరోపియన్ యూనియన్ దేశాలు రేపు ప్రత్యేకంగా సమావేశం కానున్నాయి.

  • Loading...

More Telugu News