: ఏసీబీ ముందుకు ‘సండ్ర’...ఓటుకు నోటు కేసులో నేడు ఏసీబీ కీలక విచారణ


ఓటుకు నోటు కేసులో నేడు తెలంగాణ ఏసీబీ అధికారులు కీలక విచారణను చేపట్టనున్నారు. నెలకు పైగా అనారోగ్యం పేరిట ఏసీబీ విచారణకు డుమ్మా కొడుతున్న టీడీపీ నేత, ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య నేడు ఏసీబీ అధికారుల ముందుకు రానున్నారు. రెండు రోజుల క్రితం మూడో పర్యాయం నోటీసులు అందుకున్న సండ్ర, ఏసీబీ విచారణకు హాజరవుతానని మొన్ననే ప్రకటించారు. ఈ కేసులో ప్రత్యక్ష సంబంధం లేనప్పటికీ, సండ్రకు కీలక విషయాలన్నీ తెలిసి ఉంటాయని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. అంతేకాక కేసులో మూడో నిందితుడు సెబాస్టియన్ తో సండ్ర ఫోన్ లో మాట్లాడారని కూడా ఏసీబీ అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలో నేడు సండ్రపై ఏసీబీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించే అవకాశాలున్నాయి. సండ్రతో పాటు ఈ కేసులో కీలక వ్యక్తిగా ఉన్న నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్ సన్ కు సెబాస్టియన్ ను పరిచయం చేసిన జిమ్మీబాబును కూడా ఏసీబీ అధికారులు ప్రశ్నించనున్నారు.

  • Loading...

More Telugu News