: ‘గుట్ట’ మాస్టర్ ప్లాన్ అదుర్స్... ఆలయ అభివృద్ధిపై రాష్ట్రపతి సంతృప్తి!
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధి కోసం రూపొందించిన మాస్టర్ ప్లాన్ బాగుందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. ఆలయాన్ని ఆధ్యాత్మికంగానే కాక పర్యాటకంగానూ అభివృద్ధి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం పక్కా ప్రణాళికతో మాస్టర్ ప్లాన్ ను రూపొందించిందని ఆయన పేర్కొన్నారు. నిన్న గుట్టకు వచ్చిన ప్రణబ్, లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన ఆలయ అభివృద్ధి మాస్టర్ ప్లాన్ నమూనాను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి కోసం ప్రభుత్వం రూపొందించిన ప్రణాళికలపై ప్రణబ్ సంతృప్తి వ్యక్తం చేశారు.