: 25 మంది సైనికులను కాల్చి చంపిన ఐసిస్
ఐసిస్ ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. మావన మృగాలుగా మారిపోతున్నారు. మనుషులను గుంపులు గుంపులుగా చంపుకుంటూ పోతున్నారు. ఇస్లామిక్ రాజ్య స్థాపనే లక్ష్యంగా దారుణాలకు ఒడిగడుతున్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు, తాజాగా 25 మందిని నడి రోడ్డుపై అందరూ చూస్తుండగా కాల్చిచంపారు. సిరియాలోని పల్మీరా అనే పట్టణాన్ని తమ అధీనంలోకి తీసుకున్న ఐసిస్ ఉగ్రవాదులు... సైనికులు, ఉద్యోగులను కాల్చి చంపినట్టు సిరియాలోని మానవ హక్కుల పర్యవేక్షణ సంస్థ తెలిపింది.