: తలసానిపై ఫిర్యాదు చేశాం: ఎల్ రమణ
తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ పై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఫిర్యాదు చేశామని టీడీపీ నేత ఎల్ రమణ తెలిపారు. హైదరాబాదులో రాష్ట్రపతిని కలిసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, టీడీపీ శాసనసభ్యుడిగా ఉన్న తలసానికి మంత్రి పదవి ఇచ్చిన విషయాన్ని రాష్ట్రపతికి వివరించామని అన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు అంతా కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఇతర పార్టీలను నిర్వీర్యం చేసేలా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని, ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న కేసీఆర్ ను నిలదీయాలని ఆయన ప్రజలకు సూచించారు. తలసాని శాసనసభ సభ్యత్వాన్ని రద్దుచేసేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతిని కోరినట్టు రమణ తెలిపారు.