: రాజకీయ నాయకులు 'బూతు' జిల్లా నుంచి వచ్చారు: 'టీవీ9' రవి ప్రకాశ్
రాజకీయ నాయకులు 'బూతు' జిల్లా నుంచి వచ్చారని టీవీ9 సీఈవో, చీఫ్ ఎడిటర్ రవి ప్రకాశ్ చమత్కరించారు. అమెరికాలోని డెట్రాయిట్ లో జరిగిన తానా వేడుకల్లో నిర్వహించిన ఎన్ కౌంటర్ లో ఓ ఔత్సాహిక ఎన్ఆర్ఐ మాట్లాడుతూ, 'తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని రాజకీయ నాయకులు వాడే భాష తెలుగేనా? వారి తెలుగు మాకు అర్థం కావడంలేదు, తెలుగు మేము మర్చిపోయామా? లేక నేతలు మర్చిపోయారా?' అని అడిగారు. దీనికి రవి ప్రకాశ్ సమాధానమిస్తూ, మన రాజకీయ నాయకులు మాట్లాడే భాష 'బూతు' భాష అని, వారి భాషను పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. అమెరికాలో తానా, టీటీడీలు తెలుగు పాఠశాలలు ఏర్పాటు చేసినట్టు, తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకులకు కూడా సరళమైన తెలుగు నేర్పేందుకు ఓ స్కూల్ కావాలేమో అన్నారు. రాజకీయ నాయకులంతా 'బూతు' అనే జిల్లా నుంచి వచ్చారని, వారి భాష తెలుగు కాదని, బూతు అని ఆయన స్పష్టం చేశారు.