: కొప్పుల ఈశ్వర్ కు మంత్రి పదవి ఇస్తా: కేసీఆర్
టీఆర్ఎస్ నేత కొప్పుల ఈశ్వర్ కు మంత్రి పదవి ఇస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. కరీంనగర్ లోని ధర్మారంలో జరిగిన హరితహారం సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గోదావరి పుష్కరాలను ఈ నెల 14న ధర్మపురిలో ప్రారంభిస్తామని అన్నారు. 2003 గోదావరి పుష్కరాల సందర్భంగా ఇక్కడే పవిత్ర స్నానమాచరించానని, ఆ సందర్భంగా ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుకున్నానని ఆయన గుర్తు చేసుకున్నారు. కోరిన విధంగా రాష్ట్రం సిద్ధించడంతో ధర్మపురిలోనే పుష్కర స్నానమాచరించి నరసింహస్వామి మొక్కు చెల్లించుకుంటానని ఆయన తెలిపారు.