: తెలుగు రాష్ట్రాల్లో ఒక్క కళాశాలకూ పురాతన హోదా దక్కలేదు
పురాతన విద్యా సంస్థలను పరిరక్షించాలనే లక్ష్యంతో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నిధులు అందజేయనున్న పురాతన కళాశాలల జాబితా విడుదల చేసింది. వంద సంవత్సరాలకు పైబడిన కళాశాలలు కలిగిన ఈ జాబితాలో 19 కళాశాలలు చోటు సంపాదించుకోగా, తెలుగు రాష్ట్రాలకు చెందిన ఏ కళాశాలకూ పురాతన హోదా దక్కకపోవడం విశేషం. కాగా, ఈ జాబితాలో చోటుదక్కించుకునేందుకు 60 కాలేజీలు పోటీ పడగా, అందులో 19 మాత్రమే అర్హత సాధించాయి. ఈ 19 విద్యాసంస్థల అభివృద్ధికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నిధులు విడుదల చేయనుంది. 'కాటన్ కాలేజ్ ఆఫ్ గువహటీ'కి వారసత్వ భవన పరిరక్షణలో భాగంగా అత్యధికంగా 4.35 కోట్ల రూపాయలను యూజీసీ కేటాయించింది. హెరిటేజ్ కాలేజ్ స్కీంలో భాగంగా దేశంలోని పురాతన కళాశాలల నుంచి దరఖాస్తులు ఆహ్వానించగా, ఢిల్లీలోని ఏ కళాశాల దరఖాస్తు చేయకపోవడం విశేషం.