: 'తానా'ను చూసి తెలుగు రాష్ట్రాలు నేర్చుకోవాలి: గరికపాటి
తెలుగు సంస్కృతీ సంప్రదాయాలు కాపాడుతున్న తానా ఘనత వర్ణించలేమని ఎంపీ గరికపాటి మోహనరావు అన్నారు. అమెరికాలోని డెట్రాయిట్ లో జరిగిన తానా 20వ వార్షికోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడుతూ, ప్రపంచంలో ఉన్న తెలుగు జాతి మొత్తం ఇక్కడ చేరి వేడుకలు నిర్వహించుకోవడం ఎంతో అభినందనీయమని అన్నారు. తానాను చూసి తెలుగు రాష్ట్రాలు ఎంతో నేర్చుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. సంస్కృతీ సంప్రదాయాల ద్వారా తెలుగు జాతి గొప్పదనాన్ని ప్రపంచానికి తానా చాటడం హర్షణీయమని ఆయన తెలిపారు. తెలుగు సంప్రదాయాలు కాపాడడంలో 'తానా' యువతరం ముందుకు రావడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు.