: స్కూలులో అసభ్యకర నృత్యాలు చేయమంటున్నారంటూ విద్యార్థినుల ఆరోపణ
అనంతపురం జిల్లా పామిడిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయులు తమను వేధిస్తున్నారని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. స్కూలు యాజమాన్యం, ఉపాధ్యాయులు కలిసి అసభ్యకరమైన నృత్యాలు చేయాలంటూ ఒత్తిడి చేస్తున్నారని, ఎదురు చెబితే ఇబ్బందులకు గురి చేస్తున్నారని విద్యార్థినులు వాపోతున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయకుండా నిరోధిస్తున్నారంటూ విద్యార్థినులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్కూలు యాజమాన్యంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.