: ఆ రోజు జో రూట్ ను ఎందుకు కొట్టానంటే...!: వార్నర్


రెండేళ్ల క్రితం ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఇంగ్లండ్ ఆటగాడు జోరూట్ ను బారులో కొట్టిన సంగతి క్రీడాభిమానులకు గుర్తుండే వుంటుంది. ఈ వివాదం కారణంగా వార్నర్ రెండు టెస్టుల నిషేధం ఎదుర్కొన్నాడు. ఈ సంఘటన అప్పటి ఆసీస్ కోచ్ మికీ అర్థర్ పదవి ఊడిపోవడానికి కారణమైంది కూడాను. బుధవారం నుంచి యాషెస్ సిరీస్ మొదలు కావాల్సి ఉండగా వార్నర్ గడిచిపోయిన వివాదాన్ని మరోసారి గుర్తు చేశాడు. ఆనాటి సంఘటన పూర్వాపరాలను చెప్పాడు. బార్ లో ఆసీస్ జట్టు కూర్చుని కాక్ టైల్ పార్టీ చేసుకుంటోంది. అదే బార్ లో ఇంగ్లండ్ జట్టు సభ్యులు కూడా పార్టీ చేసుకుంటున్నారట. ఆసీస్ ఆటగాడు ఒకరు మలింగ జుత్తును పోలిన విగ్ పెట్టుకుని ఉండగా, జో రూట్ వచ్చి ఆ విగ్గు తీసి తన గడ్డానికి పెట్టాడని, అది తనకు నచ్చలేదని, అయితే అలా పెట్టడం వెనుక జో రూట్ సరదాగా పీల్ అయి ఉండొచ్చని, తాను మాత్రం దానిని సరదాగా తీసుకోలేకపోయానని, అందుకే కొట్టానని వార్నర్ చెప్పాడు. మొత్తానికి వార్నర్ ఇంగ్లండ్ ఆటగాళ్లకు కండబలం చూపిస్తానని హెచ్చరించాడో, లేక గతంలో అవమానించానంటూ గుర్తు చేశాడో తెలియదు కానీ, ఓ వివాదాన్ని మాత్రం రేపాడు. యాషెస్ సిరీస్ ముందు రెండు జట్ల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. ఈసారి వార్నర్ రెండేళ్ల క్రితం జరిగిన సంఘటనను గుర్తుచేసి మాటల యుద్ధం ప్రారంభించాడు.

  • Loading...

More Telugu News