: 'టన్ను'లు, 'స్టాక్' వ్యవహారం తేల్చాలి...జగన్, విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలి: టీడీపీ నేత వర్ల
వైఎస్సార్సీపీ అధినేత జగన్ అవినీతిలో 'స్టాక్', 'టన్ను'ల వ్యవహారం తేల్చాలని టీడీపీ నేత వర్ల రామయ్య డిమాండ్ చేశారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, తక్షణం న్యాయస్థానం కల్పించుకుని, జగన్, విజయసాయిరెడ్డిల బెయిల్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రపంచంలో దొంగతనానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకున్న జగన్, దొంగతనాలకు కొత్త భాష్యం చెప్పారని ఆయన మండిపడ్డారు. జగన్ అవినీతి తవ్వే కొద్దీ బయటకు వస్తోందని ఆయన తెలిపారు. జగన్ అవినీతి బాగోతాన్ని, డబ్బు తరలించేందుకు స్టాక్, టన్నులు అంటూ కోడ్ భాష ఉపయోగించడాన్ని అత్యున్నత న్యాయస్థానం ముందు ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు. జగన్ అవినీతి గురించి తెలుసుకున్న ఎవరైనా ముక్కు మీద వేలేసుకుంటారని ఆయన చెప్పారు.