: సెక్షన్ 8 అమలుపై రేపు రాష్ట్రపతిని కలవనున్నాం: బొజ్జల


తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాదులో సెక్షన్ 8 అమలుపై రేపు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలవనున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, పట్టిసీమపై వైఎస్సార్సీపీ అధినేత జగన్ వైఖరి ఏంటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. జగన్ గోదావరి జిల్లాల్లో పర్యటించేటప్పుడు పట్టిసీమ కారణంగా ఈ జిల్లాలు ఎడారిగా మారుతాయని ఆరోపిస్తారు. అదే రాయలసీమ జిల్లాల్లో పర్యటించేటప్పుడు ప్రభుత్వం నీళ్లివ్వడం లేదని విమర్శలు గుప్పిస్తారు. ఇంతకీ జగన్ దేనికి కట్టుబడి ఉంటారు? పట్టిసీమకు అనుకూలమా? వ్యతిరేకమా? అనేది స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News