: జల రవాణా చాలా చీప్!: నితిన్ గడ్కరీ


భూ ఉపరితల రవాణా కంటే జల రవాణ మెరుగైనదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, సరుకు ఏదైనా కానీ రోడ్డు రవాణా అయితే కిలోమీటరుకు రూపాయిన్నర ఖర్చవుతుందని అన్నారు. అదే రైలు వ్యాగన్ ను ఆశ్రయిస్తే కిలో మీటరుకు రూపాయి ఖర్చవుతుందని చెప్పారు. రోడ్డు రవాణా కంటే జల రవాణా అయితే కిలోమీటరుకు కేవలం 30 పైసలు మాత్రమే ఖర్చవుతుందని ఆయన పేర్కొన్నారు. అందుకే చైనాలో సరుకు రవాణాకు జల రవాణాపై ఆధారపడతారని చెప్పారు. 47 శాతం రవాణా జల మార్గంలోనే సాగుతుందని, అదే యూరోపియన్ యూనియన్ లో అయితే 40 శాతం సరుకు జల రవాణా ద్వారా జరుగుతుందని ఆయన వెల్లడించారు. అదే సమయంలో భారత్ జల రవాణా కేవలం 3.3 శాతం మాత్రమే ఉందని ఆయన పేర్కొన్నారు. అందుకే జల రవాణాకు ప్రత్యేక ప్రణాళిక తయారు చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. దేశంలోని 101 నదులకు జలరవాణా మార్గాలు ఏర్పాటు చేయనున్నట్టు ఆయన తెలిపారు. దీనికి సంబంధించిన బిల్లు వర్షాకాల సమావేశాల్లో పార్లమెంటులో ప్రవేశపెడతామని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News