: జీసస్ లిజార్డ్ 4.8 కోట్ల ఏళ్ల పురాతనమైనది
'జీసస్ లిజార్డ్' 4.8 కోట్ల ఏళ్ల పురాతనమైనదని పరిశోధకులు తెలిపారు. అమెరికాలోని వ్యోమింగ్ లో పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలకు 'జీసస్ లిజార్డ్' అత్యంత పురాతనమైన బల్లి శిలాజం దొరికింది. దీనిపై పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలకు ఇది 4.8 కోట్ల ఏళ్ల క్రిందటే భూమిమీద ఉందని నిర్ధారించారు. 'జీసస్ లిజార్డ్' ప్రత్యేకత ఏంటంటే...ఇది నేలపై, నీటిపై కూడా పరిగెత్తగలదు. ప్రస్తుతం ఇలాంటి బల్లులు మెక్సికో, కొలంబియా వంటి చోట్ల మాత్రమే ఉన్నాయి. 'బాబిబాసిలిస్కస్ అలెక్సీ' అనే బల్లి జాతి ప్రస్తుతం మనుగడలో ఉన్న బల్లి జాతులన్నింటికీ మాతృక అని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.