: ‘వ్యాపం’ కేసులో మరో అనుమానాస్పద మృతి...ఢిల్లీలో విగతజీవిగా విచారణ బృందం సభ్యుడు


మధ్యప్రదేశ్ లో కలకలం సృష్టించిన వ్యవసాయక్ పరీక్షా మండల్ (వ్యాపం) కుంభకోణంలో మరో అనుమానాస్పద మృతి చోటుచేసుకుంది. ఇప్పటికే ఈ కేసులో ప్రత్యక్ష్యంగానో, పరోక్షంగానో సంబంధం ఉన్న పలువురు అనుమానాస్పద స్థితిలో మరణించిన సంగతి తెలిసిందే. నిన్నటికి నిన్న ఈ కేసులో కీలక సాక్షి కుటుంబాన్ని ఇంటర్వ్యూ చేసిన విలేకరి నురగలు కక్కుతూ మృత్యువాతపడ్డారు. తాజాగా ఈ కేసు విచారణ బృందంలో సభ్యుడిగా ఉన్న జబల్ పూర్ మెడికల్ కాలేజీ డీన్ అరుణ్ శర్మ నేటి ఉదయం ఢిల్లీలో శవమై తేలాడు. నగరంలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు సమీపంలోని ఉప్పల్ హోటల్ లో దిగిన అరుణ్ శర్మ, తన గదిలోనే విగత జీవిగా కనిపించాడు. అరుణ్ శర్మ మృతదేహం వద్ద కొన్ని మందులతో పాటు మద్యం సీసా కూడా ఉందని పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నివేదిక వచ్చేదాకా అరుణ్ శర్మ మృతిపై ఏమీ చెప్పలేమని పోలీసులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News