: గుంటూరు జూట్ మిల్లు వద్ద హైటెన్షన్...కార్మికుల ఆందోళన, భారీగా పోలీసుల మోహరింపు
గుంటూరు సమీపంలోని జూట్ మిల్లు వద్ద ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. మిల్లు లాకౌట్ ను వ్యతిరేకిస్తూ కార్మికులు నేటి ఉదయం మిల్లు ముందు ఆందోళనకు దిగారు. ఉదయం ప్రారంభమైన కార్మికుల ఆందోళనలో అంతకంతకూ నిరసనకారుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. దీంతో ముందస్తు జాగ్రత్త చర్యల కింద పోలీసు ఉన్నతాధికారులు పెద్ద సంఖ్యలో బలగాలను అక్కడ మోహరించారు. ఇదిలా ఉంటే, ఈ విషయాన్ని సీఎం చంద్రబాబునాయుడి దృష్టికి తీసుకెళ్లి వారంలోగా సమస్య పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకుంటామని టీడీపీ నేతలు శ్రీనివాసరావు, ఆంజనేయులు కార్మికులను చల్లబరుస్తున్నారు. అయితే నేటి సాయంత్రం వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుతో భేటీ ఏర్పాటు చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.