: గుట్టకు చేరుకున్న రాష్ట్రపతి ప్రణబ్...ఘనస్వాగతం పలికిన గవర్నర్, సీఎం కేసీఆర్
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కొద్దిసేపటి క్రితం యాదగిరిగుట్టకు చేరుకున్నారు. ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తో పాటు తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. రాష్ట్రపతి రాకకు ముందే కరీంనగర్ నుంచి కేసీఆర్, హైదరాబాదు నుంచి గవర్నర్ యాదగిరిగుట్టకు చేరుకున్నారు. ఇదిలా ఉంటే, గుట్టకు చేరుకున్న ప్రణబ్ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకోనున్నారు. దాదాపు గంట పాటు అక్కడ గడపనున్న రాష్ట్రపతి ఆలయ ప్రాశస్త్యాన్ని తెలుసుకోవడంతో పాటు ఆలయ అభివృద్ధికి తెలంగాణ సర్కారు చేపడుతున్న చర్యలను పరిశీలిస్తారు.