: హాంకాంగ్ చేరుకున్న చంద్రబాబు... మరికాసేపట్లో జపాన్ లో అడుగిడనున్న ఏపీ సీఎం
ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు మూడు రోజుల జపాన్ పర్యటనకు నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత బయలుదేరారు. కొద్దిసేపటి క్రితం ఆయన హాంకాంగ్ చేరుకున్నారు. మరికాసేపట్లో అక్కడి నుంచి బయలుదేరనున్న చంద్రబాబు, నేటి మధ్యాహ్నానికి జపాన్ లో అడుగుపెడతారు. పెట్టుబడులు రాబట్టడమే లక్ష్యంగా చంద్రబాబు జపాన్ పర్యటనకు బయలుదేరివెళ్లారు. మంత్రులు నారాయణ, యనమల రామకృష్ణుడులతో పాటు ఐదుగురు సీనియర్ ఐఏఎస్ అధికారులు కూడా చంద్రబాబు వెంట వెళ్లారు.