: పెట్టుబడులతో రండి... తానా మహాసభలకు వీడియో సందేశం పంపిన చంద్రబాబు


ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు తానా మహాసభలను పురస్కరించుకుని అమెరికాలోని ప్రవాసాంధ్రులకు వీడియో సందేశాన్ని పంపారు. విదేశాల్లో స్థిరపడ్డ వారంతా పెట్టుబడులతో తెలుగు రాష్ట్రాలకు తరలిరావాలని సదరు సందేశంలో చంద్రబాబు కోరారు. తెలుగు రాష్ట్రాల్లోని అవకాశాలను అందిపుచ్చుకోవడమే కాక ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పెంచేలా చర్యలు చేపట్టాలని కూడా చంద్రబాబు కోరారు. ప్రవాసుల కోసం ఏపీలో ప్రత్యేకంగా ఓ సెల్ ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. ప్రవాస ఐటీ నిపుణులు రాష్ట్రం గురించి వారంలో కనీసం 5 గంటల నుంచి 10 గంటలైనా ఆలోచించాలని ఆయన కోరారు. ఏపీని పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని చెప్పిన ఆయన, అందులో ప్రవాసాంధ్రుల పాత్ర కీలకమని అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్న తెలుగు ప్రజలను ఏకం చేయడంలో తానా విశేష కృషి చేస్తోందని చెప్పిన చంద్రబాబు, విదేశాల్లో తెలుగు జాతి కీర్తిప్రతిష్ఠలను ఇనుమడింపజేయాలని పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News