: కరెంట్ పోల్ ను ఢీకొట్టిన వ్యాన్... విద్యుత్ తీగలు మీదపడి బైకర్ సజీవ దహనం
కడప జిల్లా గోపవరం మండలం టీపీకుంట వద్ద నేటి తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రోడ్డుపై వెళుతున్న ఓ వ్యాన్ అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ క్రమంలో విద్యుత్ స్తంభంపై ఉన్న కరెంట్ తీగలు కింద పడ్డాయి. అదే సమయంలో అటుగా మోటార్ సైకిల్ పై వెళుతున్న ఓ యువకుడిపై ఆ తీగలు పడ్డాయి. వెనువెంటనే చెలరేగిన మంటలు ఆ యువకుని అక్కడికక్కడే కాల్చి బూడిద చేశాయి. ప్రమాదంతో ఏమాత్రం సంబంధం లేని యువకుడు మంటలకు ఆహుతి కావడం అక్కడి వారిని తీవ్ర విషాదంలో నింపింది.