: మద్యం సీసాలో కండోమ్... మందు తాగనంటూ ప్రతినబూనిన తమిళ తంబి!
అప్పటికే అతడు ఫుల్లుగా మద్యం సేవించాడు. ఇంటికెళుతూ మరో మద్యం బాటిల్ కొన్నాడు. జేబులో పెట్టుకుంటున్న మద్యం సీసాలో అతడికి కండోమ్ కనిపించింది. అంతే, మద్యపానంపై ఏవగింపు కలిగిన అతడు ఇకపై మద్యం ముట్టబోనని ప్రతినబూనాడు. ఈ ఘటన నిన్న తమిళనాడులో చోటుచేసుకుంది. తంజావూరులోని కీల్ వాసల్ కు చెందిన అళగర్ సామి నిన్న సర్కారీ మద్యం దుకాణానికి వెళ్లి ఫుల్లుగా మద్యం తాగాడు. ఇక ఇంటికెళదామని లేచిన అతడు మరో క్వార్టర్ బాటిల్ ను కొన్నాడు. జేబులో పెట్టుకుంటున్న బాటిల్ లో ఏదో తెల్లటి వస్తువు అతడికి కనిపించింది. పరికించి చూడగా, అది కండోమ్ అని తేలింది. దీంతో వెంటనే మద్యం బాటిల్ ను విసిరేసిన అళగర్ సామి, ఇకపై మందు ముట్టబోనని ప్రతిజ్ఞ చేసి అక్కడి నుంచి తూలుతూ కదిలిపోయాడు.