: మహిళా వీఆర్ఏపై ధర్మవరం ఆర్డీఓ లైంగిక వేధింపులు...ప్రభుత్వానికి సరెండర్ చేసిన ‘అనంత’ కలెక్టర్


అనంతపురం జిల్లా ధర్మవరం రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీఓ)గా పనిచేస్తున్న నాగరాజు విధి నిర్వహణను మరిచి మహిళా ఉద్యోగిపై వేధింపులకు పాల్పడ్డాడు. తన పరిధిలోని గ్రామానికి వీఆర్ఏగా పనిచేస్తున్న మహిళా ఉద్యోగిపై ఆయన లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదుతో ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్ కోన శశిధర్, నాగరాజును ప్రభుత్వానికి సరెండర్ చేసేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు జిల్లా జాయింట్ కలెక్టర్, డీఆర్ఓలతో కూడిన కమిటీతో నాగరాజుపై కలెక్టర్ విచారణ చేయించారు. బాధితురాలి ఆరోపణ నిజమేనని తెలుసుకున్న కలెక్టర్, నాగరాజును ప్రభుత్వానికి సరెండర్ చేశారు.

  • Loading...

More Telugu News