: ఏపీలో రాహుల్ పర్యటన ఖరారు...ఈ నెల 15,16 తేదీల్లో ‘అనంత’కు కాంగ్రెస్ యువరాజు
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ పర్యటన ఖరారైంది. ఈ నెల 15,16 తేదీల్లో ఆయన ఏపీలోని అనంతపురం జిల్లాలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా అనంతపురం జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను రాహుల్ పరామర్శిస్తారు. అంతేకాక రైతు కూలీలు, వలస కూలీలతోనూ రాహుల్ గాంధీ మాట్లాడతారు. ఇదివరకే రైతు సమస్యలపై దృష్టి సారించిన రాహుల్ గాంధీ, తెలంగాణలోని ఆదిలాబాదు జిల్లాలో పర్యటించిన సంగతి తెలిసిందే. తెలంగాణలో తన పర్యటనకు అనూహ్య స్పందన వచ్చిన నేపథ్యంలో ఏపీలోనూ ఈ తరహా పర్యటన చేయాలని రాహుల్ నిర్ణయించుకున్నారు.