: వారిద్దరూ బాల్య స్నేహితులు... ఇప్పుడు ఆమె జడ్జి...అతను క్రిమినల్!
అమెరికాలోని మియామి రాష్ట్రంలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. న్యాయమూర్తి మెండి గ్లేసర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఓ కేసును విచారిస్తున్నారు. ఇంతలో నిందితుడిని చూసిన ఆమె గుర్తు పట్టారు. 'చిన్నప్పుడు నువ్వు నార్టీనస్ మిడిల్ స్కూల్ లో చదివావా?' అని ప్రశ్నించారు. 'అవును' అని అతను సమాధానం చెప్పడంతో, 'మీరు హార్డర్ బాల్ట్ కదా?' అని అడిగారు. 'అవును' అని అతను సమాధానం చెప్పాడు. దీంతో జడ్జి స్థానంలో ఉన్న ఆమె 'చిన్నప్పుడు స్కూల్ లో అందరికీ ఆదర్శంగా, ఎంతో చురుకుగా, బాగా చదువుకున్న మీరు ఇలా ఎలా మారారు సర్?' అంటూ ప్రశ్నించారు. తానెవరో అతనికి గుర్తు చేశారు. బాల్యంలో తామిద్దరం స్కూల్ లో ఫుల్ బాల్ ఎలా ఆడిందీ, స్కూల్ లో ఏం చేసిందీ ఆమె గుర్తు చేశారు. దీంతో హార్డర్ సిగ్గుతో తల వంచుకున్నాడు. 'ఎంత పని జరిగిపోయింది?' అంటూ ఏడ్చేశాడు. అయితే, బాల్య స్నేహితుడే కదా అని ఆమె అతనికి మినహాయింపు ఇవ్వలేదు. డ్రగ్ సరఫరా కేసులో అతని నేరం రుజువవడంతో 44 వేల డాలర్లు చెల్లించాలని ఆదేశించారు. ఇకనైనా బుద్ధి తెచ్చుకుని సన్మార్గంలో నడవాలని సూచించారు.