: వెంకటేష్ కు అభిమాని వినూత్న కానుక
తెలుగు సినిమాల్లో విక్టరీ వెంకటేష్ ది ప్రత్యేక స్థానం. సమకాలీన హీరోల్లో ఎవరికీ లేని ఫేమ్ వెంకీ సొంతం. చిన్న పిల్లల దగర్నుంచి, పండు ముదుసలి వరకు వెంకీ అభిమానగణంలో చోటు సంపాదించుకుంటారు. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా వెంకీ సినిమాలు అభిమానులను అలరిస్తాయి. ఈ నేపథ్యంలో హీరో వెంకటేష్ కు ఓ అభిమాని వినూత్నమైన కానుక అందజేశాడు. వెంకటేష్ నటించిన సినిమాలకు సంబంధించిన పోస్టర్లతో ఏర్పాటు చేసిన కొలాజ్ ను ఆయనకు బహూకరించాడు. ఈ కానుకను ఫేస్ బుక్ లో షేర్ చేసి, తన అభిమాని కానుకను వెంకీ అందరితో పంచుకున్నాడు. కొలాజ్ ను తయారు చేసిన అభిమాని పేరు ప్రణ్యుష్ కుమార్ అని వెంకీ చెప్పాడు.