: లైంగిక వేధింపుల వల్లే ఆ మాజీ మంత్రిని పొడిచాడట!


బీహార్ మాజీ మంత్రి ఎజాజ్ ఉల్ హక్ ను అతని సమీప బంధువు రాఘవేంద్ర కత్తితో పొడిచిన సంగతి తెలిసిందే. పరారీలో ఉన్న నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా రాఘవేంద్ర మాట్లాడుతూ, హక్ తనను లైంగికంగా వేధించారని తెలిపాడు. గతంలో చాలా సార్లు లైంగిక వేధింపులకు పాల్పడిన హక్, శుక్రవారం రాత్రి కూడా లైంగిక దాడికి ప్రయత్నించడంతో విసిగిపోయి కత్తితో పొడిచేశానని చెప్పాడు. ఈ సందర్భంగా హక్ ను పొడిచిన కత్తి, అతని నుంచి దొంగిలించిన తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. కాగా, రబ్రీదేవి మంత్రి వర్గంలో హక్ మంత్రిగా పని చేశారు.

  • Loading...

More Telugu News