: ఢిల్లీలో ఇక ఆటో ఛార్జీల కంటే టాక్సీ ఛార్జీలు తక్కువ!
ఆటో ఛార్జీల కంటే తక్కువ ధరకే ట్యాక్సీ వస్తే...ఆ ప్రయాణానికి సౌకర్యానికి సౌకర్యం, వేగానికి వేగం తోడవుతుంది. అలాంటి సేవలనే ఢిల్లీ ప్రభుత్వం అందుబాటులోకి తేనుంది. సురక్షితమైన ప్రయాణానికి ఢిల్లీ ప్రభుత్వం 'స్మార్ట్ ట్యాక్సీ' సేవలను అందుబాటులోకి తేనుందని ఆ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, ఈ ట్యాక్సీలు ఆటో ఛార్జీల కంటే తక్కువ ధరకే అందుబాటులోకి రానున్నాయని అన్నారు. మెట్రో రైలు అందుబాటులో లేనప్పుడు ఢిల్లీ వాసుల జేబులకు చిల్లు పడుతున్నాయని, దానిని దృష్టిలో పెట్టుకుని ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తేనున్నామని ఆయన చెప్పారు. మెట్రో, టూవీలర్, ఫోర్ వీలర్ అందుబాటులో లేని వారికి 'స్మార్ట్ ట్యాక్సీ' వరంలా మారుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.