: బాధితులకు అమ్మ సాయం చేస్తారు: హేమమాలిని కుమార్తె ఈషా డియోల్


రాజస్థాన్ లో రోడ్డు ప్రమాదానికి గురైన హేమమాలిని ఫోర్టిస్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సంగతి తెలిసిందే. రాజస్థాన్ లోని దౌసా నుంచి హెలికాప్టర్ లో ఆమె ముంబై చేరుకున్నారు. అనంతరం ఆమె కుమార్తె, సినీ నటి ఈషా డియోల్ మాట్లాడుతూ, తన తల్లి రోడ్డు ప్రమాద బాధితులకు సాయం చేయాలనుకుంటున్నారని తెలిపింది. బాధితులకు ఆర్థిక సాయం చేస్తామని ఈషా డియోల్ చెప్పింది. అయితే ఎంత మొత్తం అనేది వెల్లడించలేదు. కాగా, రోడ్డు ప్రమాదంలో మీడియా వ్యవహరించిన తీరుపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. హేమమాలినిని ఫోర్టిస్ ఆసుపత్రికి తరలించి, బాధితులను ప్రభుత్వాసుపత్రికి తరలించడంపై కూడా నెటిజన్లు మండిపడ్డారు. అందుకే, హేమమాలిని కుటుంబం స్పందించిందని, హృదయపూర్వకంగా స్పందించి ఉంటే, ఇప్పటికే వారిని ఫోర్టిస్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించి ఉండేవారని వారు పేర్కొంటున్నారు.

  • Loading...

More Telugu News