: ఇద్దరు కుమార్తెలను ప్రపంచానికి చూపిన శిఖర్ ధావన్


టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ తన ఇద్దరు కుమార్తెలను బాహ్య ప్రపంచానికి తొలిసారి చూపించాడు. ప్రైవేటు కార్యక్రమాల్లో తన ఇద్దరు కుమార్తెల గురించి భావోద్వేగంతో మాట్లాడే శిఖర్ ధావన్, ఐపీఎల్ సందర్భంగా కుమారుడ్ని చూపించిన సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ మద్దతు తెలిపిన 'భేటీ బచావో'కు ఇద్దరు కుమార్తెలతో ఫోటో దిగి పంపించాడు. ఆ ఫోటోకు 'డాడీస్ గర్ల్స్' అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చాడు. ఈ ఫోటోకు మంచి ఆదరణ లభిస్తోంది. కాగా, 'భేటీ బచావో'కు మద్దతుగా భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూడా కుమార్తె సారాతో సెల్పీ దిగి పంపిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News