: ఆమెకు కరెంట్ ఎలర్జీ ... ఇదో అరుదైన వ్యాధి!


విద్యుత్ లేని ప్రపంచాన్ని ఊహించగలమా? ఊహూ... విద్యుత్ లేకపోతే క్షణం కూడా గడవని పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో ఓ యువతి విద్యుత్ ఎలర్జీతో బాధపడుతోంది. ఇంత వరకు వినని ఈ వ్యాధి యూకేలోని స్వీడన్ కు చెందిన జాకీ లిండ్సీ (50) కి సోకింది. ఎనిమిదేళ్ల క్రితం ఉన్నట్టుండి తన శరీరంలో వస్తున్న మార్పులను ఆమె గుర్తించింది. కళ్ల మంటలు, చెవుల్లోంచి వింత శబ్దాలు రావడం, చేతులు స్పర్శ కోల్పోవడం గమనించింది. అకస్మాత్తుగా తనకు ఏం జరుగుతోందో తెలిసేది కాదు. దీంతో వైద్యులను సంప్రదించడం, వారు మందులివ్వడం, వాటిని వాడడం చేసేది. మూడేళ్ల తరువాత తనకు విద్యుత్ ఎలర్జీ సోకినట్టు జాకీ గుర్తించింది. దీంతో ఓ వైద్య ఛారిటీని సంప్రదించింది. జాకీ విద్యుత్ హైపర్ సెన్సిటివిటీతో బాధపడుతోందని వారు గుర్తించారు. ప్రపంచంలో కేవలం నాలుగు శాతం మందికే ఈ వ్యాధి సోకే అవకాశం ఉందని వారు వెల్లడించారు. దీంతో జాకీ జాగ్రత్త పడడం ప్రారంభించింది. ఇంట్లో విద్యుత్ మొత్తం తీసేయించింది. విద్యుత్ స్థానంలో కేండిల్స్, గ్యాస్ వాడుతోంది. ఆమె ఇంట్లో ఫ్యాన్ కూడా లేదు. గాలి కావాలంటే విసనకర్రతోనే విసురుకోవాలి. జాకీ సాధారంగా బయటకు వెళ్లదు. ఒక వేళ తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే ఒంటిని కప్పిఉంచే సిల్వర్ సూట్ ధరించి బయటికి వెళ్తుంది. అప్పుడు కూడా తనను అప్రమత్తం చేసేందుకు గాలిలో విద్యుత్ శాతాన్ని తెలిపే పరికరాన్ని తనతోపాటు తీసుకెళ్తుంది. సాంకేతిక వినియోగం పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి వ్యాధులు కూడా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News