: ఐఏఎస్ ట్రైనింగ్ అకాడమీలోని మెస్ లో పనిచేసిన కుర్రాడు... సివిల్స్ లో జయకేతనం ఎగురవేశాడు!


కృషి, పట్టుదల ఉండాలే కాని, సాధించలేనిది ఏదీ లేదన్న దానికి రవికుమార్ బెస్ట్ ఎగ్జాంపుల్. ముస్సోరిలో ఉన్న 'లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్'లో ఐఏఎస్ కు ఎంపికైన వారు ట్రైనింగ్ పొందుతారు. ఈ అకాడమీలో ఉన్న మెస్ లోనే రవి అనే కుర్రాడు పనిచేసేవాడు. అలాంటి రవి సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ని క్రాక్ చేసేశాడు. ఈ రోజు ప్రకటించిన సివిల్స్ ర్యాంకుల్లో రవికి 184వ ర్యాంక్ వచ్చింది. దాదాపు 9 లక్షల మంది సివిల్స్ కి దరఖాస్తు చేశారు. వీరిలో 1236 మంది సివిల్ సర్వీసెస్ లోని వివిధ విభాగాలకు ఎంపిక అయ్యారు. ఇంత టఫ్ కాంపిటీషన్ లో, అకాడమీలోని మెస్ లో పని చేసిన ఓ సాధారణ కుర్రాడు సివిల్స్ కొట్టడం అభినందించదగ్గ అంశం. రవి కుమార్ సక్సెస్ ఎంతో మందిలో స్ఫూర్తి నింపుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

  • Loading...

More Telugu News