: ఆదిలాబాద్ జిల్లా సర్పంచ్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు షాక్... ఎమ్మెల్యే కూతురు ఓటమి!


ఆదిలాబాద్ లోని ఆసిఫాబాద్ సర్పంచ్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు షాక్ తగిలింది. పార్టీ ఎమ్మెల్యే కోవా లక్ష్మి కుమార్తె అరుణ ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్, టీడీపీ ఉమ్మడి అభ్యర్థి సరస్వతి విజయం సాధించారు. అయితే, మహబూబ్ నగర్ జిల్లాలో పలుచోట్ల జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. గోపులాపూర్, మక్తల్ మండలంలోని చినగోపులాపూర్, వనపర్తి నియోజకవర్గంలోని బుద్ధారం, ఫరూఖ్ నగర్ మండలంలోని వెలిజర్ల, మిడ్జిల్ మండలం దోనూరులో టీఆర్ఎస్ అభ్యర్థులే గెలుపొందారు.

  • Loading...

More Telugu News