: ఆ రెండు సీన్ల వల్లే 'దృశ్యం' సినిమాలో రజనీకాంత్ నటించనని చెప్పారట
విడుదలైన అన్ని భాషల్లో 'దృశ్యం' సినిమా విజయవంతమై, విమర్శకుల ప్రశంసలను సైతం పొందింది. మొదట్లో ఈ సినిమా తమిళ వర్షన్ లో నటింపజేసేందుకు రజనీకాంత్ ను సంప్రదించారట దర్శకుడు జీతూజోసెఫ్. ఈ సినిమా స్టోరీని విన్న తర్వాత రజనీ చాలా సంతోషించారని... తనకు బాగా నచ్చిందని చెప్పారని జీతూ చెప్పారు. అయితే, హీరోను, హీరో కుటుంబాన్ని బాగా హింసించడం, క్లైమాక్స్ సీన్ల గురించి ఈ సినిమాలో నటించడానికి రజనీ తిరస్కరించారని తెలిపారు. తనను కొట్టడం చూస్తే తన అభిమానులు తట్టుకోలేరని, సినిమాను రిసీవ్ చేసుకోలేరని రజనీ చెప్పారని వెల్లడించారు. రజనీ సార్ చెప్పిన దాంతో తాను కన్విన్స్ అయ్యానని... మరో మంచి స్క్రిప్ట్ తో మళ్లీ కలుస్తానని చెప్పి వచ్చానని జీతూ చెప్పారు. ఆ తర్వాత ఈ సినిమాలో కమలహాసన్ నటించడం, సూపర్ హిట్ కావడం తెలిసిందే.