: ఎమ్మెల్యే సండ్రకు మరోసారి ఏసీబీ నోటీసులు


ఓటుకు నోటు కేసులో టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు తెలంగాణ ఏసీబీ రెండోసారి నోటీసు ఇచ్చింది. ఎల్లుండి సాయంత్రం 5 గంటలలోపు విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఈ మేరకు హైదరాబాద్ లోని సండ్ర క్వార్టర్స్ కు ఏసీబీ అధికారులు వెళ్లగా, ఆ సమయంలో ఆయన ఇంట్లో లేకపోవడంతో ఇంటికి నోటీసు అంటించి వచ్చారు. ఇదిలా ఉంచితే, విచారణకు తాను సిద్ధంగా ఉన్నానని, ఏసీబీ ఎప్పుడు పిలిచినా వస్తానని రెండు రోజుల కిందట సండ్ర రెండోసారి లేఖ రాసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News