: భూమాకు ఏదైనా జరిగితే చంద్రబాబుదే బాధ్యత: బొత్స


పార్టీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిపై అక్రమంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. కర్నూలులో పోలీసుల తీరును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. భూమాను పోలీసు అధికారి ఉద్దేశపూర్వకంగానే నెట్టారని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆరోపించారు. తనను నెట్టవద్దన్నందుకే భూమాపై అట్రాసిటీ కేసు పెడతారా? అని బొత్స ప్రశ్నించారు. టీడీపీ ఆటలు సాగనివ్వమని హెచ్చరించారు. భూమాకు ఏమైనా జరిగితే చంద్రబాబే బాధ్యత వహించాలన్నారు. ఎస్కార్ట్ లేదన్న వంకతో భూమాను హైదరాబాద్ నిమ్స్ కు తరలించలేదని, ఈ ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మహిళా ఎమ్మెల్యే అని చూడకుండా భూమా కుమార్తె అఖిల ప్రియ పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారని మండిపడ్డారు.

  • Loading...

More Telugu News