: గాంధీభవన్ లో డీఎస్, కేకే, బొత్స ఫోటోల తొలగింపు


కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన పీసీసీ మాజీ అధ్యక్షులు డి.శ్రీనివాస్, కె.కేశవరావు, బొత్స సత్యనారాయణల ఫోటోలను హైదరాబాద్ లోని గాంధీభవన్ నుంచి తొలగించారు. ఈవేళ గాంధీభవన్ కు వచ్చిన కాంగ్రెస్ సీనియర్ నేతలు వి.హనుమంతరావు, దామోదర్ రెడ్డి ఆ ముగ్గురి ఫోటోలను తొలగించి చెత్తబుట్టలో పడేశారు. పార్టీ మారిన వారి చిత్రాలు గాంధీభవన్ లో ఉండటం మంచిది కాదని, వారంతా తమ స్వలాభం కోసం పార్టీ మారారని వీహెచ్, దామోదర్ రెడ్డి ఆరోపించారు.

  • Loading...

More Telugu News