: దావూద్ ఇండియాకు తిరిగి వస్తానన్నాడు... ఈ విషయాన్ని శరద్ పవార్ కు కూడా తెలిపా: రామ్ జెఠ్మలానీ


మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో తాను మాట్లాడానని ప్రముఖ న్యాయవాది రామ్ జెఠ్మలానీ వెల్లడించారు. 90లలో తాను అతనితో మాట్లాడానని, అప్పట్లో ఇండియాకు వచ్చి కేసు విచారణను ఎదుర్కోవడానికి దావూద్ సిద్ధంగా ఉన్నాడని తెలిపారు. 1993లో జరిగిన ముంబై బాంబు పేలుళ్లతో తనకు సంబంధం లేదని దావూద్ తనతో అన్నాడని, కాకపోతే ఇండియాకు వస్తే తన ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందేమో అన్న భయాన్ని కూడా వ్యక్తపరిచాడని చెప్పారు. ఇదే విషయాన్ని అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి శరద్ పవార్ కు లేఖ ద్వారా తాను తెలిపానని వెల్లడించారు. దావూద్ భాయ్ ఇండియాకు తిరిగి వస్తానన్నా భారత ప్రభుత్వం దానికి సుముఖత చూపలేదని దావూద్ ప్రధాన అనుచరుడు చోటా షకీల్ ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో తెలిపాడు. "దావూద్ భాయ్ ఇండియాకు వస్తానని తెలిపినా... మీరు, మీ ప్రభుత్వం అంగీకరించలేదు. ఇండియాకు తిరిగి వచ్చే విషయంపై లండన్ లో రామ్ జెఠ్మలానీతో భాయ్ మాట్లాడారు. కానీ, అద్వానీ గేమ్ ప్లే చేశారు" అని చోటా షకీల్ తెలిపాడు. షకీల్ వ్యాఖ్యల నేపథ్యంలో, రామ్ జెఠ్మలానీ తన మనసులోని విషయాన్ని బయటకు వెల్లడించారు.

  • Loading...

More Telugu News