: వారం రోజుల్లో మరో భారీ కుంభకోణాన్ని బయటపెడతా: సుబ్రమణ్యస్వామి
దేశాన్ని కుదిపేసిన 2G స్కామ్ ను వెలుగులోకి తీసుకురావడంలో ముఖ్యపాత్ర పోషించిన జనతాపార్టీ అధ్యక్షుడు సుబ్రమణ్యస్వామి త్వరలో మరో భారీ కుంభకోణాన్ని బయటపెడతానంటున్నారు. 'ఓ వారం రోజుల్లో మరో భారీ కుంభకోణాన్ని వెలుగులోకి తెస్తాను. దీనికి సంబంధించిన విషయసేకరణ మొత్తం పూర్తయింది' అన్నారాయన.
అవినీతి పేరుకుపోవడం వల్ల దేశ ఆర్ధిక వ్యవస్థ అతలాకుతలం అయిపోయిందని స్వామి అభిప్రాయపడుతున్నారు. సోనియాగాంధీ చేతిలో ప్రధాని మన్మోహన్ సింగ్ 'సర్కస్ కింగ్'లా మారిపోయారని ఆయన చమత్కరించారు. దేశంలో ఆర్ధిక సంస్కరణలు అమలుచేసిన ఘనత మాత్రం పీవీ నరసింహారావుకు దక్కుతుందని స్వామి అన్నారు.