: ఐదు కోట్ల బస్సులో సదుపాయాలు సరిగా లేవని ఆగ్రహం వ్యక్తం చేసిన కేసీఆర్
టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ కోసం రూ. 5 కోట్లతో ప్రత్యేకంగా ఓ బస్సు తయారైన సంగతి తెలిసిందే. అయితే, ఈ బస్సులో సదుపాయాలు సరిగా లేవంటూ కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్సులో ఎలక్ట్రానిక్ సౌండ్ సిస్టం సరిగా లేదని, సీటింగ్ సదుపాయం కూడా దారుణంగా ఉందని అధికారుల వద్ద ఆయన ప్రస్తావించారు. అంతేకాకుండా, రంగారెడ్డి, మెదక్, కరీంనగర్ జిల్లాల్లో హరితహారం కార్యక్రమానికి ఆయన బస్సులో కాకుండా తన కాన్వాయ్ లోనే వెళ్లారు. ఈ నేపథ్యంలో, కొత్త బస్సును అధికారులు హయత్ నగర్ లో ఉన్న బెంజ్ కంపెనీ గ్యారేజ్ కు తరలించారు.