: ఆసుపత్రి నుంచి హేమమాలిని డిశ్చార్జ్
బాలీవుడ్ సీనియర్ నటి, లోక్ సభ సభ్యురాలు హేమమాలిని జైపూర్ లోని ఫోర్టిస్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. "హేమ కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు ఈ ఉదయం 9.30 గంటల సమయంలో ఆమెను డిశ్చార్జ్ చేశాం" అని ఫోర్టిస్ ఆసుపత్రి అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. రెండు రోజుల కిందట రాజస్థాన్ లోని దౌసా సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హేమ ప్రయాణిస్తున్న బెంజ్ కారు ఓ ఆల్టో కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆసుపత్రిలో చేరడంతో చికిత్స అందించారు. ఇదే ప్రమాదంలో నాలుగేళ్ల చిన్నారి కూడా మృతి చెందింది.