: ఎమ్మెల్యేగా 'అమ్మ' ప్రమాణ స్వీకారం
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ పి.ధనపాల్ తన కార్యాలయంలో ఆమె చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేలు, కొందరు పార్టీ సీనియర్ నిర్వాహకులు, మంత్రులు హాజరయ్యారు. గత నెల 27న జరిగిన ఆర్కే నగర్ ఉపఎన్నికలో లక్షకుపైగా భారీ మెజారిటీతో జయ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలు శిక్ష పడటంతో ఎమ్మెల్యేగా అర్హత కోల్పోయిన జయను, తరువాత నిర్దోషిగా ప్రకటించడంతో మళ్లీ ఎమ్మెల్యేగా పోటీచేసి గెలిచారు.