: ఆళ్లగడ్డ సబ్ జైల్లో దీక్షకు దిగిన భూమా నాగిరెడ్డి
నంద్యాల వైకాపా ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఆళ్లగడ్డ సబ్ జైల్లో దీక్షకు దిగారు. ప్రభుత్వ వైద్యులు సూచించినా... వైద్య పరీక్షల కోసం తనను నిమ్స్ ఆసుపత్రికి తరలించకపోవడంపై ఆయన నిరసన వ్యక్తం చేశారు. మందులు, టిఫిన్ తీసుకోకుండా ఆయన నిరసన తెలుపుతున్నారు. నిన్న ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంలో, డీఎస్పీ దేవదానంను పరుష పదజాలంతో దూషించారన్న ఆరోపణలపై భూమాపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు సహా, మరో మూడు కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించారు.