: ఐఎస్ఐఎస్ నన్ను విడిపించేందుకు ప్లాన్ చేస్తోంది: భార్యతో భత్కల్
చర్లపల్లి జైల్లోని ఫోన్ నుంచి తన భార్యతో మాట్లాడిన భత్కల్ సంభాషణలు పోలీసు అధికారులను ఆందోళనలో పడేసింది. సుమారు 5 నిమిషాల పాటు భత్కల్ తన భార్య జాహిదాతో మాట్లాడిన మాటలను నిబంధనల ప్రకారం రికార్డు చేసిన జైలు అధికారులు వాటిని నిఘా అధికారులకు అందించారు. ఆ సంభాషణల్లో తాను త్వరలోనే జైలు గోడలు బద్ధలు కొట్టుకు వస్తానని, అందుకు సిరియా రాజధాని డమాస్కస్ సాయపడనుందని అన్నట్టు తెలుస్తోంది. దీంతో భత్కల్ ను తప్పించేందుకు ఐఎస్ఐఎస్ వర్గాలు ప్రయత్నిస్తున్నాయని అధికారులు భావిస్తున్నారు. ఈ సంభాషణలు విన్న తరువాత చర్లపల్లి జైల్లోని భత్కల్ బ్యారక్ వద్ద నిఘాను, భద్రతను మరింతగా పెంచారు.