: జీవన్ రెడ్డి చీటర్ కు ఎక్కువ, బ్రోకర్ కు తక్కువ: టీటీడీపీ నేత నన్నూరి


టీఆర్ఎస్ నేతలపై టీటీడీపీ నేతలు మాటల తూటాలు పేలుస్తున్నారు. ఓటుకు నోటు కేసు నమోదైనప్పటి నుంచి దాడిని మరింత తీవ్రతరం చేశారు. ఈ క్రమంలో, టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై టీటీడీపీ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. యూఏఈలోని ఓ బ్యాంక్ లో జీవన్ రెడ్డి అప్పు ఎగవేశాడని... షార్జా పోలీస్ స్టేషన్ లో అతనిపై కేసు కూడా నమోదైందని బాంబు పేల్చారు. జీవన్ రెడ్డి చీటర్ కు ఎక్కువ, బ్రోకర్ కు తక్కువ అంటూ విరుచుకుపడ్డారు. ఆయన ఇచ్చిన చెెక్ కూడా చెల్లలేదని నర్సిరెడ్డి తెలిపారు. జీవన్ రెడ్డి జైలుకు పోవడం ఖాయమని జోస్యం చెప్పారు. జగన్ పార్టీలో దొంగలున్న విధంగానే... ఇప్పుడు టీఆర్ఎస్ లో గల్ఫ్ బ్రోకర్లు, దొంగలు చేరుతున్నారని... జీవన్ రెడ్డి లాంటి అంతర్జాతీయ నేరస్తులు టీఆర్ఎస్ లో చేరడం సహజమేనని ఎద్దేవా చేశారు. తెలంగాణ భాష, యాస పేరుతో కేసీఆర్ చేసిన తిట్ల పురాణాన్ని పుస్తకంగా వేసి ఇస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News