: కేసీఆర్ ను 'నయా నిజాం' అంటూ ఎద్దేవా చేసిన దిగ్విజయ్
టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ ఆరోపణాస్త్రాలు సంధించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కేసీఆర్ గాలికి వదిలేశారని... కోట్ల విలువైన కొత్త బస్సులు, హంగామాలు, హంగులతో కాలం గడిపేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ కు కొత్త నిజాంలా కేసీఆర్ తయారయ్యారని ఎద్దేవా చేశారు. తెలంగాణ జిల్లాల్లో పర్యటించడానికి కేసీఆర్ కు రూ. 5 కోట్ల విలువైన బస్సు అవసరమా? అని ప్రశ్నించారు. ముందు ఎన్నికల హామీలను నెరవేర్చాలని సూచించారు.