: టాయిలెట్ కట్టించలేదని యువతి ఆత్మహత్య!
ఇంట్లో టాయిలెట్ కట్టించాలని ఎంతగా అడుగుతున్నా పట్టించుకోలేదని ఆరోపిస్తూ, 17 ఏళ్ల యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలోని దుమ్కాలో జరిగింది. తమ కుమార్తె కుష్బు కుమారి వివాహం నిమిత్తం కొంత డబ్బు దాచుకున్నారు ఆ తల్లిదండ్రులు. బహిర్భూమి నిమిత్తం రోజూ బయటకు వెళ్లి ఇబ్బందులు పడలేని ఆ అమ్మాయి, ఇంట్లో టాయిలెట్ కట్టించాలని కోరుతూ వచ్చింది. ఆ అమ్మాయి ఆలోచనలకు భిన్నంగా టాయిలెట్ బదులు వివాహం చేసి అత్తారింటికి పంపాలన్నది తల్లిదండ్రుల అభిప్రాయం. ఎంతకీ తన మాటలు వినడం లేదన్న మనస్తాపంతో కుష్బు తన ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.