: చర్లపల్లి జైలు నుంచి పారిపోయేందుకు ఉగ్రవాది భత్కల్ కుట్ర!


ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఉన్న ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాది యాసిన్ భత్కల్ పారిపోయేందుకు కుట్రపన్నాడు. తాను జైలు నుంచి పారిపోయి వస్తున్నానని, అందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని సన్నిహితులకు పలుమార్లు భత్కల్ ఫోన్లు చేసినట్టు అధికారులు గుర్తించారు. ఢిల్లీలో ఉన్న తన భార్య జాహిదాతో సైతం భత్కల్ మాట్లాడాడని, త్వరలోనే మనం కలుసుకుంటామని చెప్పాడని తెలుస్తోంది. యాసిన్ కుటుంబ సభ్యుల ఫోన్ కాల్స్ ను రికార్డు చేసిన ఎన్ఐఏ ఈ మేరకు జైలు అధికారులను అప్రమత్తం చేసినట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని కేంద్ర, రాష్ట్ర నిఘా వర్గాలకూ ఎన్ఐఏ సమాచారం ఇచ్చింది. దీంతో చర్లపల్లి జైల్లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఖైదీలు తమవారితో ఫోన్లలో సంభాషించుకునే సదుపాయాన్ని భత్కల్ ఈ విధంగా వాడుకున్నాడని, జైల్లోని అధికారిక ఫోన్ నుంచి భార్యతో ఆయన మాట్లాడాడని ఎన్ఐఏ విచారణలో తేలింది. కాగా, జైల్లోని ఖైదీలు మాట్లాడే మాటలను తాము వినకపోయినా, వాటిని రికార్డు చేస్తామని, అడిగితే ఈ వివరాలు విచారణ సంస్థలకు అందిస్తామని అధికారులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News