: భూమాకు ఛాతీలో నొప్పి... ఏమైనా జరిగితే తెలుగుదేశం అంతు చూస్తామంటున్న వైకాపా కార్యకర్తలు
నంద్యాల మేజిస్ట్రేట్ విధించిన 14 రోజుల రిమాండు నిమిత్తం ఆళ్లగడ్డ సబ్ జైలుకు వైకాపా నేత భూమా నాగిరెడ్డిని తరలిస్తున్న సమయంలో ఆయన తన ఛాతీలో నొప్పిగా ఉందని తెలిపారు. ఆయన్ను పరిశీలించిన ఆళ్లగడ్డ వైద్యులు భూమాకు స్వల్పంగా గుండెపోటు వచ్చిందని, రక్తపోటు అధికంగా ఉందని తెలిపారు. మెరుగైన చికిత్సా సదుపాయాలు ఇక్కడ లేవని, తక్షణం హైదరాబాద్ నిమ్స్ కు తరలించాలని సూచించడంతో, ఆయనను హైదరాబాద్ తీసుకువస్తున్నారు. కాగా, తమ నేతను అన్యాయంగా అరెస్ట్ చేశారని ఆరోపిస్తున్న వైకాపా కార్యకర్తలు, భూమాకు ఏదైనా జరిగితే తెలుగుదేశం పార్టీ అంతు చూస్తామని హెచ్చరించారు. పరిస్థితిని సమీక్షిస్తున్న పోలీసు అధికారులు ఆళ్లగడ్డకు మరిన్ని బలగాలు తరలించాలని భావిస్తున్నట్టు సమాచారం.