: భూమాకు అస్వస్థత... హైదరాబాద్ నిమ్స్ కు తరలింపు


నిన్న కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోలీసులను దూషించారన్న ఆరోపణలపై అరెస్టయిన వైకాపా ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిని పోలీసులు హైదరాబాద్ తరలిస్తున్నారు. ఈ కేసులో భూమాను నంద్యాల మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచి ఆళ్లగడ్డ సబ్ జైలుకు తరలిస్తుండగా, ఆయన స్వల్ప అస్వస్థతకు లోనయ్యారు. తిరిగి ఆసుపత్రికి తీసుకెళ్లగా వైద్యులు హైదరాబాదులోని నిమ్స్ కు తరలించాలని సూచించారు. దీంతో భూమాను హుటాహుటిన హైదరాబాదుకు తీసుకొస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

  • Loading...

More Telugu News